నిజమే అతను వివాదాలకు ఆది. ఈ చరిత్రలో ఇమడని అరాచకవాది. వెండి తెరను సైకిల్ చైన్ తో కొట్టిన ఉన్మాది. అతనే రామ్ గోపాల్ వర్మ. అతను తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది అటాక్స్ అఫ్ 26/11’ నిన్న దేశమంతా విడుదల అయింది.
అద్బుతమైన చిత్రీకరణతో వాస్తవీకతకు తన క్రియేటివిటీని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రసంశలు అందుతున్నాయి. కాకపోతే ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ ఒకతను కోర్టును ఆశ్రయించాడు. ఉగ్రవాదులు మన దేశానికీ రావడానికి కారణమైన ‘కుబేర్’ పడవను వర్మ సినిమాలో అదే పేరుతో వాడుకున్నాడు. అయతే తన అనుమతి లేకుండా తన పడవ పేరునూ, రిజిస్ట్రేషన్ నెంబర్ నూ వాడుకున్నాడని ఆ పడవ యజమాని హీరాలాల్ వర్మపైన కేస్ వేసాడు. అయితే నేను అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించాను కాని హీరాలాల్ ఆచూకీ నాకు దొరకలేదు అని వర్మ చెప్పాడు.