వర్మకి సపోర్ట్ గా నిలిచిన ఇండస్ట్రీ

ram-gopal-varma

రామ్ గోపాల్ వర్మ రీజనల్ సెన్సార్ బోర్డు ఆఫీసర్ ధనలక్ష్మి పై యుద్ధం చేయడానికి సిద్దమయ్యాడు. ధనలక్ష్మితో తనకు జరిగిన అనుభవాన్ని ఈ రోజు చానల్స్ లో లైవ్ లోపంచుకుంటున్నారు.

ఈ రోజు మొదట 12 గంటలకి ఎబిఎన్ చానల్ లో లైవ్ లో పాల్గొన్న తర్వాత 2 గంటలకి సాక్షి చానల్ లో లైవ్ ఇచ్చాడు. ఎబిఎన్ చానల్ లో డిష్కషన్ లో ఉన్నప్పుడు చాలా మంది నిర్మాతలు టీవీ చానల్ కి ఫోన్ చేసి వారి చెడు అనుభవాలను పంచుకున్నారు. ఈ విషయంలో వర్మకి అందరూ సపోర్ట్ చేసారు. ఈ విషయంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, మోహన్ బాబు కూడా సపోర్ట్ చేసారు.

నిర్మాతల మండలి ప్రెసిడెంట్ బూరుగపల్లి శివరామకృష్ణ కూడా కాల్ చేసి మాట్లాడుతూ ‘ఇప్పటికే ఐ&బి మినిస్ట్రీ ని కలిసి సమస్యని వివరించాం. అలాగే సిబిఎఫ్సి ఆఫీసర్ ని కలిసి కూడా సమస్యని వివరించాం. కానీ అది చెప్పి ఒకటిన్నర సంవత్సరం అయినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని’ ఆయన అన్నారు.

Exit mobile version