కొత్త జోనర్ కి శ్రీకారం చుట్టనున్న రామ్ గోపాల్ వర్మ

కొత్త జోనర్ కి శ్రీకారం చుట్టనున్న రామ్ గోపాల్ వర్మ

Published on Jun 18, 2013 4:35 PM IST

PSYCHO
ఎప్పటికప్పుడు తన సినిమాలతో వివాదాల్లో ఉండే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకూ తను తీసిన హార్రర్, ఫ్యాక్షన్, మాఫియా జోనర్స్ లో ఇక ముందు సినిమాలు చేయబోనని చెప్పి మరో సారి వార్తల్లో నిలిచాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. రామ్ గోపాల్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ‘సైకో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులు ఓ కొత్త రామ్ గోపాల్ వర్మని చూడాలనుకుంటున్నారు. ముందు ముందు అలా ఏమన్నా సినిమాలు చేయబోతున్నారా? అని అడిగితే దానికి వర్మ సమాధానం ఇస్తూ ‘ ప్రస్తుతం నేను ఒక రెండు మూడు కొత్త ఐడియాలను డెవలప్ చేస్తున్నాను. అలాంటి సినిమాలు నేను ఇంతవరకూ చేయలేదు. అలా అని అవి భక్తిరస, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు కాదు. ప్రస్తుతం అవి ఏ జోనర్ కి సంబందించినవి అనేది చెప్పలేను కానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఇకముందు నేను ఇప్పటివరకూ నేను చేసిన హార్రర్, ఫ్యాక్షన్, మాఫియా జోనర్స్ లో సినిమాలు చేయనని’ అన్నాడు.

వర్మ ఇలా అనడంతో వర్మ ఫ్యాన్స్ ఎలాంటి జోనర్ లో సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా అనే ఉత్కంఠ మొదలైంది. గత కొద్ది రోజులుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వర్మ తన పంథా మార్చి తీయనున్న సినిమాలతో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

తాజా వార్తలు