సత్య2 పై వచ్చిన పుకార్లకు మీడియానే కారణమంటున్న వర్మ

RGV
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అలాగే వివాదాల విషయంలో కూడా ఆయన ముందుంటాడు. గత వారంలో వర్మ ‘ఎల్ఆర్ యాక్టివ్’ వివాదం వల్ల సత్య 2 సినిమా వాయిదా వేస్తున్నామని తెలియజేశారు.

ఈ రోజు వర్మ మరో కొత్త రీజన్ ని ట్వీట్ చేసాడు. ‘ నేను ఎల్ఆర్ యాక్టివ్ గురించి చేసిన ట్వీట్ గురించి మీడియా తప్పుగా ప్రచారం చేసింది. నేను చెప్పిన దానికి ఇన్నర్ గా స్టాఫ్ కి అతని మధ్య జరిగిందే తప్ప ఇంకేమీ లేదని’ ట్వీట్ చేసాడు. అలాగే ‘ అవికూడా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చాయి. అవి ఇప్పుడు క్లియర్ అయిపోయాయి. సత్య 2 లో ఎల్ఆర్ యాక్టివ్ అనేది ఒక పార్ట్ అయిపొయిందని’ మరో ట్వీట్ చేసాడు. దీనితో ఈ విషయం ముగిసిపోయింది. మీడియా వారే ఈ విషయాన్నీ తప్పుదారి పట్టించారు.

చివరికి ఈ సినిమాని హిందీ మరియు తెలుగు భాషల్లో నవంబర్ 8న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీలో అనైక సోతి హీరోయిన్ గా కనిపించనుంది.

Exit mobile version