మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘రేయ్’. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. కానీ ఇంకా విడుదలకి మాత్రం నోచుకోలేదు. ఇప్పటకే పలుసార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
మేము తాజా వింటున్న వార్తల ప్రకారం రేయ్ సినిమా ఎలక్షన్స్ తర్వాత విడుదల అవుతుందని అంటున్నారు. వైవిఎస్ చౌదరి ఇంకా ఈ సినిమాని బాగా తయారు చెయ్యడం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అందుకే సినిమా రిలీజ్ కూడా ఆలస్యం అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాని ఎక్కువగా యుఎస్, కరేబియన్ ఐలాండ్స్ లో షూట్ చేసారు.
సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు.