స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేసు గుర్రం’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్ ప్రాక్టీస్ చేస్తున్న ‘డౌన్ డౌన్ డౌన్ డుప్ప’ సాంగ్ ని ఈ రోజు నుంచి షూట్ చేస్తున్నారు. ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ ని వేసారు. ఈ పాటలో అల్లు అర్జున్ తో పాటు శృతి హాసన్ కూడా స్టెప్పు లేస్తోంది.
నిన్నటి వరకూ హిందీ మూవీ ‘గబ్బర్’ షూటింగ్ లో పాల్గొన్న శృతి హాసన్ ఈ రోజు నుంచి ఈ చిత్ర టీం తో కలిసి పనిచేయనుంది. ఈ పాటతో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత నాలుగు రోజుల్లో మిగిలిన పాచ్ వర్క్ ని కూడా ఫినిష్ చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నల్లమలపు శ్రీనివాస్ – డా. కె వెంకటేశ్వరరావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కిక్ శ్యాం, సలోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.