ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మరోసారి హాట్ టాపిక్ గా నిలిచిన బాలీవుడ్ చిత్రమే “ధురంధర్”. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా సాలిడ్ టాక్ తెచ్చుకొని అదరగొట్టింది. అయితే ఈ సినిమా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా ఇందులో ఎమోషన్ కి భారత దేశపు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ సినిమాపై నటి రేణు దేశాయ్ కూడా స్పందించడం జరిగింది.
ధురంధర్ సినిమా ఖచ్చితంగా ప్రతీ ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అని దర్శకుడు ఆదిత్య ధర్ బ్రిలియంట్ వర్క్ అందించారు అని మనల్ని క్షేమంగా ఉంచడానికి భారత సైన్యం, రక్షణా దళం 24 గంటలూ శ్రమిస్తున్నారు వారి వల్లే మీరు రక్షణ, స్వేచ్ఛని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ సినిమా చూస్తే మీకు అర్ధం అవుతుంది అని ఇకనైనా సూడో సెక్యులర్స్ గా ఉండడం మానుకొని మన దేశం వైపు ప్రతీ ఒక్కరూ నిలబడాలి అని కొందరు ఫేక్ సెక్యులర్స్ కి కూడా కొంచెం ఘాటు గానే తన స్పందన వ్యక్తం చేయడం వైరల్ గా మారింది.
