ఫిబ్రవరిలో రాబోతున్న రేణిగుంట


తమిళ్లో విజయవంతమైన ‘రేణిగుంట’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ‘జర్నీ’ చిత్రాన్ని పంపిణీ చేసి విజయం సాధించిన సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. రేణిగుంట చిత్రాన్ని పన్నీర్ సెల్వం డైరెక్ట్ చేయగా నిశాంత్, జానీ, సనూష ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా గణేష్ రాఘవేంద్ర సంగీతం చిత్ర ఆడియో ఈ వారంలో విడుదల కాబోతుంది.

Exit mobile version