మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అనుదీప్ కెవి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 2026 ఏప్రిల్ 3న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలోని ఫన్ అండ్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాతో అనుదీప్ మరోసారి తనదైన ట్రాక్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
