అవును మీరు విన్నది నిజమే..ఇదే వార్తని అందాల భామ రీమా సేన్ అందరికీ చెప్పుకోని తెగ సంబరపడిపోతోంది. ‘చిత్రం’ మరియు ‘మనసంత నువ్వే’ చిత్రాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇటీవలే శివ్ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. తాజాగా రీమా సేన్ గత నెలలో విడుదలైన ‘గాంగ్స్ అఫ్ వస్సేపూర్’ చిత్రంలో మనోజ్ బాజ్పాయ్ సరసన కనిపించారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్ళైన తర్వాత కెరీర్ ఎలా సాగుతోంది అని అడిగిన ప్రశ్నకు రీమా సేన్ సమాధానం చెబుతూ ” అందరి కథానాయికలకు పెళ్ళైన తర్వాత అక్క మరియు వదిన పాత్రలు ఎక్కువగా వస్తుంటాయి కానీ నాకు మాత్రం అన్ని కథానాయిక పాత్రలే వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత నాకు అదృష్టం ఎక్కువైంది, అదంతా నా భర్త వల్లే మరియు నా భర్తది గోల్డెన్ లెగ్ అన్నారు. ఇంకొన్ని రోజులలో నా పర్సనల్ లైఫ్ లో లీనమైపోతాను” అని అన్నారు. రీమా సేన్ ఇలానే మరికొన్ని అవకాశాలు దక్కించుకుంటూ ఇంకొంత కాలం ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.