ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ రెడ్. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ చిత్ర టీజర్ యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రెడ్ టీజర్ 10మిలియన్ వ్యూస్ సాధించి అబ్బురపరిచింది. ఒక కోటి మందికి పైగా రెడ్ టీజర్ యూ ట్యూబ్ లో చూశారు. ఇస్మార్ శంకర్ మూవీ తరువాత మంచి ఫార్మ్ లోకి వచ్చిన రామ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థం అవుతుంది.
తమిళ హిట్ మూవీ తాడం కి రీమేక్ గా రెడ్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తుండగా, స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి బంపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి