రెబెల్ ఆడియో విడుదల తేది ఖరారు

రెబెల్ ఆడియో విడుదల తేది ఖరారు

Published on Aug 23, 2012 8:35 PM IST


ప్రభాస్ రాబోతున్న చిత్రం “రెబెల్” సెప్టెంబర్ లో భారీ విడుదలకు సిద్దమయ్యింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా కథానాయికలుగా తమన్నా, దీక్షా సెత్ లు అందాలు ఆరబోయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి స్పందన కనిపించింది.  ఈ చిత్రం మీదున్న అంచనాలను ఈ ఫస్ట్ లుక్ మరింత పెంచింది. జే పుల్లా రావు మరియు జే భగవాన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల సెప్టెంబర్ 5న జరగనుంది. ఈ చిత్రానికి లారెన్స్ స్వయంగా సంగీతం అందించారు. సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో విడుదల కానుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు