బేగంపేట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న” రెబల్ “


” యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ” హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ” రెబల్ ” ప్రస్తుతం బేగంపేట్ పబ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొంతమంది ఫైటర్స్ మరియు మోడల్స్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చిత్రీకరణలో పాల్గొనడం లేదు. మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ ఈ చిత్రం లో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రభాస్ కెరీర్ లోనే బారీ వ్యయంతో నిర్మించబడుతోంది.ఈ చిత్రాన్ని జె.భగవాన్ మరియు జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం మరియు దర్శకత్వ బాధ్యతల్ని రాఘవ లారెన్స్ వహిస్తున్నారు. ఈ సినిమా నుండి అనుష్క మరియు సంగీత దర్శకుడు తమన్ తప్పుకోవడం వల్ల ఈ సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యం అయ్యింది.

Exit mobile version