రీ – రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న “రెబల్”


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబల్” చిత్రం చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.చిత్రంలోని కీలక సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ప్రస్తుతం రీ- రికార్డింగ్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో తమన్నా మరియు దీక్ష సెత్ లు కనిపించనున్నారు. లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా ఆయనే చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కానుంది. భగవాన్ మరియు పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Exit mobile version