సెప్టెంబర్ 28న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి “రెబల్” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర విజువల్స్ విడుదలయ్యాక ప్రేక్షకుల్లో మంచి స్పందన సంపాదించుకుంది. తమన్నా ఈ చిత్రంలో చాలా అందంగా కనిపిస్తుంది. చూస్తుంటే ఈ చిత్రానికి తమన్నా ప్రధాన ఆకర్షణగా మారనున్నట్టు తెలుస్తుంది. దీక్ష సెత్ తెరకి మరింత అందాన్ని అద్దనుంది. ప్రభాస్ హీరోయిజంకి వీళ్ళ అందం గట్టి పోతీనివ్వనున్నట్టు కనిపిస్తుంది. లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జే భగవాన్ మరియు జే పుల్లారావు నిర్మిస్తున్నారు.