వినూత్నంగా జరగనున్న ‘రెబల్’ ఆడియో

వినూత్నంగా జరగనున్న ‘రెబల్’ ఆడియో

Published on Sep 9, 2012 10:21 AM IST


మాకు అందిన తాజా సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ ఆడియోని చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వీలైనన్ని ప్రాంతాల్లో ఆడియోని విడివిడిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు జె పుల్లారావు మరియు జె భగవాన్ ఆడియో వేడుకని చాలా స్టైలిష్ గా మరియు సరికొత్తగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించారు. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 14న భారీ ఎత్తున జరగనుంది, ఆ వేడుకకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే మీకందజేస్తాము. ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు