చివరికి పొరపాటు తెలుసుకున్న ఇలియానా

చివరికి పొరపాటు తెలుసుకున్న ఇలియానా

Published on Aug 25, 2012 8:49 AM IST


ఇలియానా చివరికి తన పొరపాటు తెలుసుకుంది. ఏ విషయంలో అంటారా? అదేనండి స్నేహితుడు సినిమాలో ఒక పాట కోసం దర్శకుడు శంకర్ సూచన మేరకు సన్నబడిన విషయం మనకు తెలిసిందే. అసలే సన్నగా ఉండే ఆమె మరింత సన్నగా ఉండటంతో ఆ సినిమాలో ఆమెను చుసిన వారందరూ పెదవి విరిచారు. ఇటీవలే ఆమె నటించిన జులాయి, దేవుడు చేసిన మనుషులు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె మరీ బక్క చిక్కి అలాగే ఉండటంతో అందరూ ఆమెని విమర్శించించడం మొదలు పెట్టారు. ఆ వాఖ్యలు ఇలియానా వరకు వెళ్లినట్టు ఉన్నాయి. చివరికి తను మళ్లీ బరువు పెరగాలని నిర్ణయించుకుంది.

తాజా వార్తలు