మాస్ మహారాజ్ రవి తేజ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఆయన దొరికిన ఈ క్వారెంటైన్ సమయాన్ని తన పిల్లలతో సరదాగా గడపడానికి ఉపయోగిస్తున్నారు. సాధారణంగా షూటింగ్స్, మీటింగ్స్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే స్టార్స్ జీవితాలకు కరోనా వైరస్ కారణంగా కొంత విరామం దొరిగింది. దీనితో వారి వారి వ్యాపకాలలో ముగినిపోతున్నారు.రవితేజ తన కొడుకు కూతురితో సరదాగా గడుపుతున్నాడు. ఆ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇక ఈ ఏడాది డిస్కో రాజా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ చిత్రం చేస్తున్నారు. క్రాక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా రవితేజ మరోమారు పోలీస్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.