ఇప్పుడు రోజుల్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఉన్న ప్రచారమే ఎలా వెళ్లిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి సినిమాల పరంగా ఇంకా ఎక్కువే ఉంటున్నాయి. రిలీజ్ లు కాకుండానే నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడం దారుణంగా జరుగుతుంది. అయితే దీనికి మాధ్యమం సోషల్ మీడియా.
అయితే ఒక దశాబ్ద కాలం కితం వరకు ఫేస్ బుక్ లో ఫ్యాన్ వార్స్ ఉండేవి కానీ నెమ్మదిగా ట్విట్టర్ అందరికీ అలవాటు అయ్యింది. ఇక అక్కడి స్క్రాప్ బ్యాచ్ అంత ట్విట్టర్ లోనే పడ్డారు. అప్పుడు వరకు చాలామంది ట్విట్టర్ ప్రశాంతంగా ఉండేది అనుకునేవారు కానీ ఇపుడు మన తెలుగు యువత అందులోనే దారుణంగా నెగిటివ్ కి అలవాటు పడ్డారు.
దీనిపైనే మాస్ మహారాజ రవితేజ మాట్లాడ్డం జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ అంటేనే నెగిటివిటీ అని అందుకే అసలు ఎక్కువ దాన్ని వాడనని తెలిపారు. కామెంట్స్ ఏమీ చదవను కానీ ఆ నెగిటివిటీ నుంచి మాత్రం దూరంగా ఉండడానికి చూస్తానని రవితేజ తెలిపారు. మరి తాను చెప్పిన దానిలో ఒక్క అక్షరం కూడా తప్పు లేదని చెప్పవచ్చు. మరి ఈ నెగిటివ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడు మారుతారో వాళ్ళకే తెలియాలి.