నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టిన మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ చిత్రం “మాస్ జాతర” ఇటీవల విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఇక రవితేజ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో పాటను చిత్రీకరిస్తుండగా, టీమ్ ఇటీవల స్పెయిన్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో 76వ సినిమా. సంక్రాంతి 2026లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ నిర్మిస్తోండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version