మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిత్రబృందం చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సినిమా చిరు-అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కాగా నయనతార హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “మీసాల పిల్ల” సూపర్ హిట్‌గా మారి సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మాస్ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలో విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ చిత్రాన్ని సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కేథరిన్ త్రెసా కీలక పాత్రలో కనిపిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
