తన లాస్ట్ చిత్రం “డిస్కో రాజా” అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోయినా తన లేటెస్ట్ చిత్రం “క్రాక్” కు మాత్రం దానిని మించిన అంచనాలు తెచ్చుకోగలిగాడు మాస్ మహారాజ్ రవితేజ. తన ఆల్ టైం హిట్ కాంబో గోపీచంద్ మలినేని, శృతి హాసన్ అలాగే థమన్ ల కలయికలో వస్తున్న మరో పవర్ ఫుల్ చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు సెట్టయ్యాయి.
ఇక అలాగే విడుదలకు రెడీ అవుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా ట్రైలర్ ను ఇప్పుడు మేకర్స్ వదిలారు. మరి ఈ ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే వేరే లెవెల్లో అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే ఈ సంక్రాంతికి మాస్ ఆడియెన్స్ అండ్ రవితేజ ఫ్యాన్స్ కు మరో పండగనే తీసుకొచ్చేలా ఉన్నారనిపిస్తుంది. వెంకీ మామ వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మొదలైన ఈ ట్రైలర్ నాన్ స్టాప్ ఎనర్జిటిక్ గా ఉంది.
రవితేజ అయితే తన మాస్ విశ్వరూపమే చూపించారని చెప్పాలి. ఫుల్ ఆన్ ఎనర్జిటిక్ కాప్ పోతరాజు వీర శంకర్ గా అదరగొట్టారు అలాగే ఈ ట్రైలర్ డైలాగ్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా అనిపిస్తున్నాయి.మరి విలన్స్ రోల్స్ లో కనిపించిన టాలెంటెడ్ సీనియర్ నటులు సముథ్రఖని అలాగే వరలక్ష్మి శరత్ కూడా మోస్ట్ పవర్ విలన్స్ గా గట్టిగానే కనిపిస్తున్నారు.
ఇక దర్శకుడు రొటీన్ పోలీస్ డ్రామాలా కాకుండా ఈ చిత్రాన్ని మరో విధంగా చూపిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. అలాగే ఈ ట్రైలర్ లో మరో మెయిన్ ఎస్సెట్ థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉంది.జి కె విష్ణు సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. శృతి హాసన్ మరియు రవితేజాల మధ్య మంచి కెమిస్ట్రీ ఒకటేంటి అన్నీ ఈ ట్రైలర్ లో బాగా దట్టించారు. మొత్తానికి మాత్రం మాస్ మహారాజ్ కం బ్యాక్ సాలిడ్ గానే ఉండేలా అనిపిస్తుంది. మరి ఈ సాలిడ్ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ వారు నిర్మాణం వహించారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి