మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సారొచ్చారు’ డిసెంబర్ 21న విడుదల కావడానికి సిద్దమవుతుంది. మేము ఇప్పుడే ఈ చిత్ర నిర్మాత ప్రియాంక దత్ తో మాట్లాడాము, ఆమె ఈ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. అలాగే డా. దాసరి నారాయణరావు గారి సిరి మీడియా వారు ఈ సినిమాని ఆంద్రప్రదేశ్లో చాలా ఏరియాల్లో విడుదల చేయనున్నారు.
‘సారొచ్చారు’లో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ జోడీ కట్టారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని ఇటీవలే డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేసారు. పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అశ్వినీ దత్ గారి శ్రీ వైజయంతి సమర్పణలో త్రీ ఏంజెల్స్ మీడియా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు