మాస్ మహారాజ “సారోచ్చారు” చిత్రం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ “U” సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో రవితేజ,కాజల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ త్రీ ఏంజెల్స్ ప్రై లి బ్యానర్ మీద నిర్మించారు.