మాస్ మహారాజ రవితేజ, హన్సిక జంటగా నటిస్తున్న ‘పవర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొన్ని వారాలుగా ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని హైదరాబాద్, బెంగుళూరులో షూట్ చేసారు. కెఎస్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో బ్యాంకాక్ లో జరగనుంది. మా దగ్గర ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ చిత్ర యూనిట్ ఒక నెల జరగబోయే లాంగ్ షెడ్యూల్ కోసం కోల్ కతా వెళ్లనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోనా వెంకట్ డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.