రవితేజ బలుపు ఆడియో రిలీజ్ డేట్

Balupu
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జూన్ 1వ తేదీన హైదరాబాద్లోని హెచ్ఐసిసి సెంటర్లో జరగనుంది. ముందుగా ఈ సినిమా ఆడియోని విజయవాడలో రిలీజ్ చేయాలనుకున్నారు కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ కి మారింది. గతంలో రవితేజ హిట్ సినిమాలైన ‘కిక్’, ‘మిరపకాయ్’ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

గతంలో రవితేజతో ‘డాన్ శీను’ సినిమా చేసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రవితేజ ఫుల్ మాస్ లుక్ ఓ కనిపించనున్న ఈ సినిమాని పివిపి సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version