చివరిదశకు చేరుకున్న రవితేజ మూవీ

చివరిదశకు చేరుకున్న రవితేజ మూవీ

Published on Nov 10, 2012 12:57 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘సార్ వచ్చారు’ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ అంతా దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ ఆడి పాడుతున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఊటీ, యూరప్ మరియు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకొంది. ‘ఆంజనేయులు’ సినిమా తర్వాత రవితేజ – పరశురాం కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి విజయ్. కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే ‘బలుపు’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమాలో రవితేజతో శ్రుతి హాసన్ మరియు అంజలి రొమాన్స్ చేయనున్నారు.

తాజా వార్తలు