వైజాగ్ వెళ్లనున్న రవితేజ,శృతి హాసన్


రవితేజ మరియు శృతి హాసన్ త్వరలో “బలుపు” చిత్రంలో కనపడబోతున్నారు అన్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమాస్ బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ నవంబర్లో మొదలు అయ్యింది. రవితేజ,శృతి హసన్ మరియు బ్రహ్మానందంల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర రెండవ షెడ్యూల్ డిసెంబర్ 15 నుండి వైజాగ్లో మొదలు అయ్యి డిసెంబర్ 20 వరకు చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. అంజలి రెండవ కథానాయికగా నటిస్తుండగా అడవి శేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో విడుదల కానుంది.

Exit mobile version