ప్రేమకథ చిత్రాల్లో కొన్ని మాత్రమే క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోతాయి. ఏళ్లు గడిచినా కొన్ని సినిమాలకు క్రేజ్ మాత్రం తగ్గదు. అలాంటి వాటిలో కల్ట్ లవ్ స్టోరీ చిత్రంగా ‘7/G బృందావన కలని’ కూడా ఒకటి. 2004లో దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్యూర్ రొమాంటిక్ అండ్ యూత్‌ఫుల్ చిత్రంగా కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా ఈ చిత్రం యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో వస్తే, మంచి టీఆర్పీ రేటింగ్ నమోదవుతుంది. ఇక ఈ సినిమాను గతంలో రీ-రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా, ఈ సినిమాలోని కొన్ని ఐకానిక్ సీన్స్‌ను పలు టీవీ షోలలో రీక్రియేట్ చేస్తూ ఈ సినిమాను ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా అభివర్ణిస్తుంటారు.
అయితే, తాజాగా ఈ సినిమాలోని ఐకానిక్ బస్ స్టాప్ సీన్‌ను ఈ చిత్ర హీరోహీరోయిన్ ఓ టీవీ షోలో తాజాగా రీ క్రియేట్ చేశారు. హీరోయిన్ తన గురించి ఏమనుకుంటుందో వివరించే హీరో ఈ సీన్లో అద్భుతంగా నటిస్తాడు. ఇప్పుడు ఇదే సీన్‌ను మరోసారి ఈ జోడీ రీక్రియేట్ చేయడంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఓ టీవీ షోలో జరిగే ఈవెంట్లో ఈ ఐకానిక్ సీన్ రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ ఎవర్గ్రీన్ చిత్రానికి సీక్వెల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.