సెప్టెంబర్ 21న జనాన్ని భయపెట్టబోతున్న రవిబాబు


రవిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం “అవును” సెప్టెంబర్ 21న విడుదలకు సిద్దమయ్యింది. పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యనే రవిబాబు ఈ కథ నిజంగా జరిగిన సంఘటన గురించిన కథ అని “నువ్విలా” చిత్రీకరణ సమయంలో యామి గౌతం చెప్పిన కథ అని తెలిపారు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి కలిగే భయం గురించి ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని అద్భుత శక్తులు ఉన్నా ఈ చిత్రం హర్రర్ చిత్రం కాదని రవిబాబు చెప్పారు. ఈ చిత్రాన్నిరవి బాబు, ప్రసాద్ వి పోట్లురి మరియు రవి బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version