ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి రామ్ చరణ్ మరోసారి తనదైన ట్రీట్ నటుడుగా అందించనున్నారని కెమెరా మెన్ రత్నవేలు చెబుతున్నారు.
లేటెస్ట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ కి హాజరైన రత్నవేలు పెద్ది, రామ్ చరణ్ కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో కొత్త కోణాన్ని తన నటనతో చూపించబోతున్నారు అని రంగస్థలం సినిమాటోగ్రఫర్ తెలిపారు. అలాగే సినిమా 50 శాతం పూర్తి చేశామని బలమైన స్క్రిప్ట్ దీనిని డిఫరెంట్ గా షూట్ చేస్తున్నామని తను తెలిపారు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.