‘ది గర్ల్‌ఫ్రెండ్’ నార్త్ అమెరికా కలెక్షన్స్ !

The-Girlfriend Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఐతే, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో $375K డాలర్లు కంటే ఎక్కువ వసూళ్లతో మొదటి వారాంతం ముగిసింది. మొత్తానికి ఈ సినిమా అక్కడ $500K డాలర్ల మార్కుకు దగ్గరగా ఉంది, ఈ రోజు ముగిసే నాటికి ఈ మార్క్ ను కూడా చేరుకునే అవకాశం ఉంది.

ఇక భారతదేశంలో, ఈ చిత్రం మొత్తం కలెక్షన్స్ దాదాపు రూ. 5 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. మరి ఈ సోమవారం నుంచి ఈ సినిమా థియేటర్స్ లో ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాతో రష్మిక కమర్షియల్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రజెంట్ చేశారు.

Exit mobile version