దగ్గుబాటి ఫ్యామిలీ వారసుడు రానా తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. వెట్రిమారన్ డైరెక్షన్లో ‘వాడ చెన్నై’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నాడు. శింబు హీరోగా నటిస్తుండగా ఆండ్రియా జెరేమియా హీరోయిన్ గా నటిస్తున్నారు. క్లౌడ్ నైన్ బ్యానర్ పై దయానిధి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమవుతుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై రానా తమిళ నట కూడా తన ప్రస్థానం మొదలుపెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వెట్రిమారన్ ‘ఆడుకలాం’ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నారు.