పెద్ద మొత్తానికి అమ్ముడు పోయిన రానా మూవీ రైట్స్

పెద్ద మొత్తానికి అమ్ముడు పోయిన రానా మూవీ రైట్స్

Published on Aug 27, 2012 10:38 AM IST


యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ చిత్రం యొక్క యు.ఎస్.ఎ రైట్స్ 90 లక్షలకు అమ్ముడు పోయాయి. రానా కెరీర్లో ఇంత పెద్ద మొత్తానికి రైట్స్ అమ్ముడు పోవడం ఇదే మొదటిసారి. ‘గమ్యం’ మరియు ‘వేదం’ చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రానా లాంటి హీరో సినిమాని ఇంత పెద్ద మొత్తానికి రైట్స్ అమ్ముడు పోవడం చెప్పుకోదగ్గ విషయం.

భారీ యాక్షన్ సన్నివేశాలతో పూర్తి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సరైన కమర్షియల్ హిట్ లేని రానాకి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఎంతో కీలకమైన చిత్రంగా మారింది. ఈ చిత్రం విజయం సాదించి మరియు తనకి ఫుల్ ఎనర్జీ ఇస్తుందని రానా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

తాజా వార్తలు