టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా వస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఆడియో అక్టోబర్ 7న హైదరాబాద్లో జరగనుంది. ఎక్కువ భాగం ఈ ఆడియో వేడుక సినీమాక్స్ మల్టీప్లెక్స్లో జరగనుంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో కొన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇచ్చారని సమాచారం. ‘గమ్యం’ మరియు ‘వేదం’ లాంటి మల్టీ స్టారర్ చిత్రాలు తీసిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయిక మరియు నయనతార ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు. జె. సాయిబాబు మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.