రానా దగ్గుబాటి ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. రానా బర్త్ డే సందర్భంగా ఇటీవలే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం, అలాగే అతనికి వచ్చిన ప్రశంశల విషయంలో ఎంతో గర్వంగా ఫీలవుతున్నాడు. ఇటీవలే విడుదలైన రానా బాహుబలి టీజర్ ని పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ టీజర్ కంటే తక్కువ సమయంలోనే 10 లక్షల మంది చూసారు. బాహుబలి టీం నుంచి వచ్చిన మూడవ వీడియో ఇది. అన్ని వీడియోలకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. రమ్య కృష్ణ రాజమాతగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ యుద్ద సీక్వెన్స్ ని తీయడానికి సిద్దమవుతోంది. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎంకీరవాణి సంగీతమందిస్తున్నాడు. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2015 లో విడుదల కానుంది.