మంచి కారణం కోసం ప్రియ ఆనంద్ తో చేతులు కలిపినా రానా మరియు నవదీప్


ప్రియ ఆనంద్ తన రాబోతున్న పుట్టిన రోజుని ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకుంటుంది. సెప్టెంబర్ 17న పుట్టినరోజు జరుపుకోబోతున్న ప్రియ ఆనంద్ నలంద వే ఫౌండేషన్ తో కలిసి 25 మంది అనాధ పిల్లలను చదివించాలని నిర్ణయించుకున్నారు. “నలంద వే మరియు ఆరెంజ్ స్ట్రీట్స్.ఇన్ వారితో కలిసి 25 మంది పిల్లలను చదివించబోతున్నాను. పిల్లల లిస్టు సిద్దం చేస్తున్నాను చాలా కష్టంగా ఉంది ఎంపిక చెయ్యాలంటే నాకు సహాయం చెయ్యాలనుకుంటే వాళ్ళకి సహాయం చెయ్యండి” అని ప్రియా ట్విట్టర్లో చెప్పారు. ఈ పోస్ట్ కి మన యువ నటులు రానా దగ్గుబాటి మరియు నవదీప్ మద్దతు తెలిపారు. ట్విట్టర్లో వారి అభిమానులకి ఈ విషయాన్నీ చెబుతూ ఆ పిల్లల చదువుల కోసం ఎంతో కొంత డబ్బుని దానం చెయ్యమని కోరారు. దీనికిగాను ప్రియ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియా ఆనంద్ శర్వానంద్ సరసన “కో అంటే కోటి” చిత్రం లో నటిస్తుంది. అనీష్ కురువిల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశల్లో ఉంది.

Exit mobile version