దసరా రేసులో ‘కృష్ణం వందే జగద్గురుం’

దసరా రేసులో ‘కృష్ణం వందే జగద్గురుం’

Published on Aug 23, 2012 8:20 AM IST


రానా హీరోగా తెరక్కుతున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ దసరా బాక్స్ ఆఫీస్ రేసులో నిలవనుంది. రానా సరసన నయనతార కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేసి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. రానా ఈ సినిమాలో బి టెక్ బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. గమ్యం, వేదం వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, విమర్శుకులు మెచ్చే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి బాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు