రానా బాబు సినిమాకి ఈ రోజే సెన్సార్.!


ప్రతీసారి విమర్శకులు మెచ్చి తన సినిమాల ద్వారా మెసేజ్ ఇచ్చి కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే క్రిష్ ఈ సినిమాలో మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ అంశాలు జోడించారు. సురభి నాటకాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో నాటకాల నేపధ్యంగా కర్ణాటకలోని బళ్లారిలో జరుగుతున్న మాఫియా ఉదంతాన్ని ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేసాడు క్రిష్. ఈ సినిమాలోసమీర రెడ్డి స్పెషల్ సాంగ్లో నర్తిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఆ సాంగ్లో స్పెషల్ అట్రాక్షన్ గా దర్శనం ఇవ్వబోతున్నారు. రానా బి.టెక్ బాబుగా రాబోతున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర సెన్సార్ ఈ రోజు జరగనుంది. నయన తార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై సాయి బాబు, జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version