బీటెక్ బాబుగా రాబోతున్న రానా

బీటెక్ బాబుగా రాబోతున్న రానా

Published on Mar 12, 2012 8:15 AM IST


యువ నటుడు రానా త్వరలో మన ముందుకు బీటెక్ బాబుగా రాబోతున్నాడు. విమర్శకులు మెచ్చే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో ఆయన పాత్ర పేరు బీటెక్ బాబు. గతంలో ‘గమ్యం’ మరియు ‘వేదం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్ రూపొందిస్తున్న మూడవ చిత్రం కృష్ణం వందే జగద్గురుం. క్రిష్ మాట్లాడుతూ బీటెక్ బాబు పాత్ర మాస్ ని ఆకట్టుకునేలా తన గత చిత్రం గమ్యంలోని గాలి శీను, వేదం సినిమాలోని కేబుల్ రాజు పత్రాల లాగ ఉంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని హీరొయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాగర్లమూడి సాయి బాబు నిర్మాత.

తాజా వార్తలు