తనకు మసాలా కామిడీ ఘాటు నచ్చిందంటున్న రాణా

rana-daggubati
డి. సురేశ్ బాబు మరియు రానా తో కలిపి మరికొంత మంది ప్రముఖులు ‘మసాలా’ సినిమా ప్రత్యేక షో ను నేడు తిలకించారు. ఈ సినిమా అన్నీ లాంచనాలను ముగించుకుని ఈ నెల 14 న విడుదలకానుంది. ఈ సినిమా చూసిన రానా అధి తనకు ఎంతగానో నచ్చేయడంతో తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు

“ఇప్పుడే మసాలా చిత్రాన్ని చూశాను. వెంకీ మరియు రామ్ ల నటన అద్బుతం. ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే చిత్రం. వాచ్ క్లైమాక్స్ ఇన్ మై ఐమాక్స్” అని ట్వీట్ చేశాడు

ఈ సినిమా బాలీవుడ్ లో ఘనావిజయం సాదించిన ‘బోల్ బచ్చన్’ కు రీమేక్. కె. విజయభాస్కర్ దర్శకుడు. వెంకీ, రామ్ వెరైటీ పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు

Exit mobile version