మరో అతిధి పాత్రలో రానా

మరో అతిధి పాత్రలో రానా

Published on Nov 9, 2012 5:54 PM IST

టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా సినిమాలు చేస్తూనే పరభాషా చిత్రాల్లో అతిధి పాత్రలు చేయడానికి అంగీకరిస్తున్నారు. రానా ఇప్పటికే తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో అతిధి పాత్ర చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు హిందీలో రణ్ బీర్ కపూర్ మరియు దీపికా పడుకొనే జంటగా నటిస్తున్న ‘ ఏ జవాని హై దీవాని’ అనే సినిమాలో ఒక కీలక పాత్ర చేయడానికి అంగీకారం తెలిపారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తమిళ వారికి రానా కొత్తే కానీ బాలీవుడ్ కి మాత్రం కాదు. ఇప్పటికే రానా బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసారు. ప్రస్తుతం తెలుగులో రానా మరియు నయనతార జంటగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

తాజా వార్తలు