రానాకి పుట్టినరోజు శుభాకాంక్షలు

Rana
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి డిసెంబర్ 14న పుట్టినరోజు జరుపుకున్నారు అయన చేసినవి ఆరు చిత్రాలే అయినా తనకంటూఇటు టాలీవుడ్ మరియు బాలివుడ్లో ఒక మార్క్ ని సృష్టించుకున్నారు. “లీడర్” వంటి చిత్రంతో తెరకు పరిచయం అవ్వడం అటు తరువాత కూడా అన్ని విభిన్న చిత్రాలు చెయ్యడం ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ మధ్య అయన నటించిన “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంలో అయన నటన అందరి ప్రశంసలు అందుకుంది. పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడుతూ రానా ఇలా “ఇలాంటి పాత్రలు దక్కడం నిజంగా నా అదృష్టం మంచి కథలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అని నిరూపించారు” అని అన్నారు. ఈ మధ్యనే తమిళ చిత్రాలలో నటిస్తున్నాను అని తరువాత చిత్రం ద్విభాషా చిత్రంగా ఉండబోతుంది అని చెప్పారు. రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Exit mobile version