నరసింహ స్వామి అవతారంలో యంగ్ హీరో రానా


ఈ వార్త వినగానే అవాక్కయ్యారా.! మీరు విన్నది నిజమే. యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుమ్”. ఈ చిత్రంలో రానా కొన్ని సన్నివేశాలలో నరసింహ స్వామి అవతారంలో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన చిత్రీకరణలో ఈ గెటప్ కి సంభందించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఈ గెటప్ మరియు నరసింహ స్వామి వేషధారణ విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. ఈ గెటప్లో వచ్చే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా కీలకం అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కృష్ణ తత్త్వం ఉన్న అబ్బాయి పాత్రలో ఉగ్ర నరసింహ స్వామి అవతారాన్ని చూపించడం అనేది ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు.

Exit mobile version