2013లో బిజీగా ఉండబోతున్న తారలలో రానా ఒకరు కానున్నారు ఆ ఏడాది కి కాను అయన డైరి పూర్తిగా నిండిపోయింది. 2013లో అయన మొత్తం ఆరు చిత్రాలను చెయ్యనున్నారు. ఏ చిత్రం ముందుగా మొదలవుతుంది అనేది ఇంకా తెలియరాలేదు. కాని తమిళ,తెలుగు మరియు హిందీలలో మొత్తం ఆరు చిత్రాలను చెయ్యనున్నారు. ఆదిత్య భట్టాచార్య మరియు ఆయన్ ముఖర్జీల దర్శకత్వంలో హిందీ చిత్రంలోనూ అజిత్,నయనతార, ఆర్య మరియు తాప్సీ ప్రధాన పాత్రలో విష్ణు వర్ధన్ దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రంలోనూ చిన్న పాత్రలలో మెరవనున్నారు ఇది కాకుండా మూడు తెలుగు చిత్రాలను చెయ్యనున్నారు. ఈ మధ్య విడుదల అయిన “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రంకి మంచి స్పందన రావడమే కాకుండా రానా నటనను అందరు ప్రశంసించడం తో రనాకి మరిన్ని అవకాశాలు వఛ్చాయి.