సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఐతే, జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’.తాజాగా రమ్యకృష్ణ ఈ షోకు అతిథిగా వచ్చి.. తన కెరీర్ ప్రారంభ రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘నాకు ఇప్పటికీ గుర్తు. నా కెరీర్ ప్రారంభంలో అందరూ నన్ను ఐరన్‌లెగ్ అనేవారు. తెలుగులో నా తొలిచిత్రం ‘భలే మిత్రులు’. అందులో సెకండ్ హీరోయిన్గా నటించాను. ఆ సమయంలో వరుసగా 7 సంవత్సరాలు నేను నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి’ అని ఆమె తెలిపింది.
రమ్యకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ ప్లాప్ ల సమయంలో దర్శకుడు విశ్వనాథ్ గారు ‘సూత్రధారులు’ కోసం నన్ను ఆడిషన్స్‌కు పిలిచారు. డాన్స్ చేయమన్నారు. ఆయనకు నచ్చి ఓకే చేశారు. యాక్టింగ్‌లో స్కూల్, కాలేజ్, పీజీ మొత్తం ఆ ఒక్క సినిమాతో నేర్చుకున్నాను. ఆ సినిమానే నా కెరీర్‌కు తొలిమెట్టు. ఆ చిత్రం చూసిన తర్వాతే రాఘవేంద్రరావు ‘అల్లుడుగారు’లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నా కెరీర్ చాలా స్పీడ్ తో వెళ్ళింది. మంచి సినిమాలు చేశాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.
