‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ రోల్ అదే ?

యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. లాక్ డౌన్ కు ముందు గోవాలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ, హీరోయిన్ గా నటిస్తోన్న కేతిక శర్మకి తల్లి పాత్రలో నటిస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆకాష్ పూరి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోందట.

నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమా నుండి ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది. పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకోవంతో పాటు సినిమా పై కూడా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version