తన తాజా చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రమేష్ వర్మ సిద్ధం అయ్యారు. గతం లో ‘ఒక ఊరిలో’, ‘మల్లెపూవు’, ‘రైడ్’ మరియు ‘వీర’ చిత్రాలకి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. 2011 లో విడుదలైన ‘వీర’ రమేష్ వర్మ చిత్రాల్లో పెద్ద చిత్రం. రవి తేజ, కాజల్,,తాప్సీ లాంటి తారలు వున్నా ఆ చిత్రం పరాజయం పాలైంది. అపట్నుంచి ఈ దర్శకుడు ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
ఇప్పుడు కొత్త తారాగణం తో ‘అబ్బాయితో అమ్మాయి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా తారాగనాన్ని ప్రకటించవలసి వుంది. ఈ చిత్రం ఒక 18 ఏళ్ళ అబ్బాయి ఒక 17 ఏళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగే ఒక రొమాంటిక్ చిత్రం. షూటింగ్ ప్రరంభించుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
మోహన్ రూప ఫిల్మ్స్ పతాకం పై కీరిటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.