ఆగష్టు చివరివారంలో విడుదలకానున్న రామయ్యా వస్తావయ్యా ఆడియో

ఆగష్టు చివరివారంలో విడుదలకానున్న రామయ్యా వస్తావయ్యా ఆడియో

Published on Aug 8, 2013 4:00 AM IST

Ramayya-Vasthavayya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఆడియో విడుదల వేడుక ఆగష్టు చివరివారంలో జరగనుందని సమాచారం. ఈ చిత్ర బృందం ఆగష్టు 23న గానీ, 25న గానీ ఈ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కు జంటగా సమంత నటిస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఒక కళాశాలకు యువనాయకుడిగా కనిపించనున్నాడు. అతని అభిమానులు ఈ సినిమాకోసం ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు

ఇదివరకు ఎన్.టి.ఆర్ తో కలిసి ‘బృందావనం’ వంటి హిట్ ఇచ్చిన దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత

తాజా వార్తలు