కొత్త షెడ్యూల్లో రామయ్యా వస్తావయ్యా

Ramayya-Vasthavayya

ఎన్.టీ.ఆర్ తదుపరి సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ అత్యంత వేగంతో ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో సమంత, శ్రుతి హాసన్ ను హీరోయిన్స్ గా తీసుకున్నాడు. ఇటీవలే హార్స్ రైడింగ్ క్లబ్ దగ్గర దర్శనమిచ్చిన మన యంగ్ టైగర్ ఈరొజునుండి మరో నూతన షెడ్యూల్ షూటింగ్లో పాల్గుంటున్నాడు. ఈ రోజు హైదరాబాద్లో మొదలైన ఈ సరికొత్త షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ శ్రుతి హాసన్ మధ్య కొన్ని ముఖ్య సన్నివేశాలను తీస్తారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాని ఆగష్టు 9న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్.టి.ఆర్ ఒక స్టూడెంట్ పాత్ర పోషించడం విశేషం.

Exit mobile version